Asamardhuni Jeeva Yatra – Chapter 1

Share:

Listens: 0

Telugu Sahityam Teasers

Arts


#అసమర్ధునిజీవయాత్ర "ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టారు? ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? ఈ యుద్దాలు, ఈ నాశనాలు, బాధలు, తాపత్రయాలు, అన్నీ తప్పుతాయిగా? అంతా సుఖంగా బతుకుతారుగా ! వాళ్లీ విధంగా ఆలోచించరు. జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు". ఇది ఆ అసరమర్ధుని ఫిర్యాదు. గోపీచంద్ గారి 'అసమర్ధుని జీవయాత్ర' చాలా మంది అడిగిన శ్రవణ పుస్తకం. ఇది తెలుగులో మొదటి మనోవైజ్ఞానిక నవల గా గుర్తింపు పొందింది. ఈ పుస్తకం అందించడంలో గోపీచంద్ గారి తనయులు, నటులు సాయిచంద్ గారి సహకారానికి కృతఙ్ఞతలు. – #అసమర్ధునిజీవయాత్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-asamardhuni-jeevayatra Listen to a part of Chapter 1 of #AsamardhuniJeevaYatra. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.