Chivaraku Migiledi – Chapter 1

Share:

Listens: 0

Telugu Sahityam Teasers

Arts


#చివరకుమిగిలేది కావ్య ఖండాల్లాంటి కథలెన్నో వ్రాసిన ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు వ్రాసిన ఒకే ఒక నవల – చివరకు మిగిలేది. అయితేనేం, తెలుగులో వచ్చిన ముఖ్యమైన మూడు మనోవైజ్ఞానిక నవల్లో ఒకటిగా పేరు గడించింది. మిగతావి గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర', రావిశాస్త్రి 'అల్పజీవి'.   తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు పఠన్య గ్రంధంగా నిర్దేశింపబడిన ఈ నవల గురించి బుచ్చిబాబు గారే స్వయంగా ఇలా వ్రాసారు.  "గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'-కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్నిబట్టి ఈ సమస్యని నవలలో చర్చించి, ఒక సమాధానం కనుక్కున్నానని కాదు. ఈ వస్తువుని వ్రాసేస్తే విషయం నాకు విశదపడుతుందనీ, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందనీ తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేపోవడం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో 'చెడుగు' - 'పాపం' - ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపైబడి వారి జీవితాల్ని ఏవిధంగా వికసించనీయకుండా, పాడుచేసింది- యిది కూడా ఒక ప్రధానమైన అంశమే. ఒకరు చేసిన అపచారాలకి మరియొకరు బాధ్యులై బాధపడడం వల్ల సమాజంలో వ్యక్తిగతమైన నైతిక విలువలకి తావులేకుండా పోతుంది" – #చివరకుమిగిలేది శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-chivaraku-migiledi Listen to a part of Chapter 1 of #ChivarakuMigiledi. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.