Hrudaya Netri – Chapter 1

Share:

Listens: 0

Telugu Sahityam Teasers

Arts


#హృదయనేత్రి భారత స్వతంత్ర సంగ్రామానికి పూర్వమూ, స్వాతంత్రానంతరమూ దేశంలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులని ఇతివృత్తంగా తీసుకుని మాలతీ చందూర్ రాసిన నవల 'హృదయనేత్రి.' విస్తారమైన కేన్వాస్ ఉన్న ఈ నవల చదువుతూ ఉంటే టైం మిషీన్ లో ఒక్కసారిగా ఓ వందేళ్ళు వెనక్కి వెళ్లి పోయి, అక్కడి నుంచి తాపీగా ఓ అరవై-డెబ్భై ఏళ్ళు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 1992 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నవల ఇది. మహాత్ముడిని మెప్పించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 'చీరాల-పేరాల' ఉద్యమానికి పూర్వరంగంతో మొదలు పెట్టి, స్వతంత్ర పోరాటం, కాంగ్రెస్, జనతా ప్రభుత్వాల పనితీరు మీదుగా ఇందిగా గాంధీ పాలన, ఎమర్జెన్సీ, అనంతర పరిస్థితులని పరామర్శిస్తూ, ఇందిరా హత్యతో ముగుస్తుంది నవల. ఇది కేవలం దేశ భక్తుల కథ మాత్రమే కాదు, స్వార్ధ పరులు, వేర్పాటు వాదులు కూడా భాగమే ఇందులో. మూలం: http://nemalikannu.blogspot.com/2013/04/blog-post_29.html – #హృదయనేత్రి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-hrudaya-netri Listen to a part of Chapter 1 of #HrudayaNetri. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.